ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని హిందూ, సిక్కు, క్రైస్తవ మైనారిటీలను ఆ దేశ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2024-25 ఫెడరల్ బడ్జెట్లో వీరి కోసం కనీసం ఒక రూపాయి అయినా కేటాయించలేదు. గత ఏడాది కేవలం 10 కోట్ల పాకిస్థానీ రూపాయిలను కేటాయించింది.
ప్రభుత్వ వైఖరి వల్ల తమ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని మైనారిటీ నేతలు మండిపడుతున్నారు. 24.4 కోట్ల పాక్ జనాభాలో హిందువులు 1.6 శాతం, క్రైస్తవులు 1.6 శాతం ఉన్నారు. సిక్కులు, ఇతర మతాలవారితో కలిపితే మొత్తం మైనారిటీల జనాభా కేవలం 5 శాతం మాత్రమే.