ఇస్లామాబాద్ : అమెరికాతో పాటు చైనా బ్లాక్‌లిస్టులో పెట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు పాకిస్థాన్ ప్రధాని రూ.14 కోట్ల పరిహారం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తున్నది. భారత్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పన రూ.14 కోట్లు అందించినట్టు సమాచారం. ఆ కుటుంబసభ్యుల చట్టబద్ధమైన వారసులకు ఈ పరిహారం అందిస్తామని పాక్ ప్రకటించింది. బాధితులకు ఇండ్లు కట్టిస్తామని తెలిపింది.