Pakistan | పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గడువుకు ముందే పార్లమెంట్ రద్దు..!
Pakistan | పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు (Dissolve Parliament)చేయాలని భావిస్తోంది.
Pakistan | పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు (Dissolve Parliament) చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (Pakistan Muslim League-Nawaz), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (Pakistan Peoples Party) కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుంది.
దీంతో సార్వత్రిక ఎన్నికలకు అదనపు సమయం పొందేందుకు ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు అంటే ఆగస్టు 8న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాన పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తొలుత ఆగస్టు 9, లేదా 10 తేదీల్లో పార్లమెంట్ ను రద్దు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అధికార కూటమి నేతలతో చర్చించారు. కానీ దిగువ సభను రద్దు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయాలపై సైతం చర్చించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆగస్టు 8న పాక్ పార్లమెంట్ రద్దు చేయాలని ప్రభుత్వం భావించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీంతో నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ కూటమి భావిస్తోంది.
Also Read..
Viral Video | ఒకే కంచంలో.. సింహంతో ఫుడ్ షేర్ చేసుకున్న యువతి
Viral News | ఆ గ్రామంలో రోజూ ఒకే టైమ్‌కి పవర్ కట్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

