ఇస్లామాబాద్: భారత్ దాడులు చేస్తుందనే ఆందోళన పాకిస్థాన్‌లో తీవ్రమవుతున్నది. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం 29 జిల్లాల్లో ఎమర్జెన్సీ అలర్ట్ సైరన్లను అమర్చడం ప్రారంభించింది. గగనతల దాడులపై ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఈ సైరన్లను మోగిస్తారు.
ఆలస్యం చేయకుండా వీటిని అమర్చాలని, క్రమం తప్పకుండా ప్రోగ్రెస్ రిపోర్టులను సమర్పించాలని ఈ ప్రావిన్స్‌లోని అధికారులను సివిల్ డిఫెన్స్ ఆదేశించింది.