గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 02, 2020 , 01:58:49

మిడతల దాడి.. పాక్‌లో ఎమర్జెన్సీ!

మిడతల దాడి.. పాక్‌లో ఎమర్జెన్సీ!

ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి 1: దాయాది దేశం పాకిస్థాన్‌లో జాతీయ ఎమర్జెన్సీని విధించారు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ‘కరోనా’ వైరస్‌ వల్లనో, యుద్ధ పరిస్థితుల చేతనో ఈ అత్యవసర పరిస్థితి విధించారనుకుంటే పొరపాటే. పంటపొలాలపై మిడతల దండు విరుచుకుపడటంతో ఏం చేయాలో అర్థంకాక ఆ దేశం ఇలా ఎమర్జెన్సీని విధించింది. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్‌ ప్రావిన్స్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లోకి మిడతల దండు దండెత్తడంతో వేలాది ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. దీంతో మిడతలను తరిమికొట్టేందుకు ప్రణాళికలు రచించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. అలాగే, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. 1993లో కూడా ఇలాగే మిడతల దండు సమస్య నెలకొన్నదని, అయితే, ప్రస్తుత సమస్య దానికంటే తీవ్రంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.


logo