ఇస్లామాబాద్ : భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి మరోసారి బట్టబయలైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ నాయకుడే బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఉగ్రవాద సంస్థలు భారత్‌లోని ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు దాడులు చేశాయంటూ.. పాక్ నాయకుడు చౌదరి అన్వరుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘బలూచిస్థాన్‌లో మీరు ఇలాగే రక్తపాతం సృష్టిస్తే, మేం భారత్‌లో ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు దాడులు చేస్తాం. దీనిని ఇప్పటికే పూర్తిచేశాం’ అని హక్ అన్నాడు.