ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో సాధారణ ఎన్నికల నగారా మోగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న దేశంలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రభుత్వాధికారులను నియమించడాన్ని నిలిపుదల చేస్తూ లాహోర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పాకిస్థాన్లో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 19న రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది.