US Iran Ceasefire | అమెరికాతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరినప్పటికీ యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది. తాము ప్రతిపాదించిన 10 సూత్రాలకు ఆమోదం లభించినప్పుడు మాత్రమే యుద్ధానికి ముగింపు లభిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన చర్చలు పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో ఈ నెల 10వ తేదీన చర్చలు ప్రారంభమవుతాయని తెలిపింది. తమకు అమెరికాపై నమ్మకం లేదని.. అయినప్పటికీ ఈ చర్చల కోసం రెండు వారాల సమయం ఇచ్చామని పేర్కొంది. అవసరమైతే పరస్పర అంగీకరాంతో గడువు పొడిగించే అవకాశం కూడా ఉందని చెప్పింది.
ఈ చర్చల్లో శత్రువు లొంగిపోవడం ఒక నిర్ణయాత్మక రాజకీయ విజయంగా మారితే.. ఈ గొప్ప చారిత్రక విజయాన్ని మనందరం కలిసి జరుపుకుందామని ఇరాన్ ప్రజలను ఉద్దేశించి సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్యూరిటీ తెలిపింది. లేదంటే ఇరాన్ జాతి డిమాండ్లు నెరవేరే వరకు భుజం భుజం కలిపి పోరాడదామని సూచించింది. మా చేతులు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి.. శత్రువు చేసే చిన్న పొరపాటును కూడా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.
అమెరికా దాడులను నిలిపితేనే తమ సాయుధ దళాల రక్షణ చర్యలను నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్ఘాచీ ప్రకటించారు. సాంకేతిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటూ ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్‌తో రెండు వారాల పాటు హోర్ముజ్ జలసంధిని తెరవనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున ట్వి్ట్టర్(ఎక్స్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఆసిం మునిర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికతో పాటు ఇరాన్ ప్రతిపాదించిన పది సూత్రాలపై చర్చలకు యూఎస్ అంగీకరించిందని అన్నారు. అయితే ఇరాన్‌పై దాడులు పూర్తిగా ఆగితేనే కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక పరిమితులకు లోబడి, ఇరాన్ సైన్య సమన్వయంతో హోర్ముజ్ జలసంధి నుంచి రాకపోకలు జరుగుతాయని వెల్లడించింది.
Statement on behalf of the Supreme National Security Council of the Islamic Republic of Iran: pic.twitter.com/cEtBNCLnWT
— Seyed Abbas Araghchi (@araghchi) April 7, 2026