Robbery: అదో హైటెక్ నగరం..! ఆ నగరంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో పోలీసులకు తెలిసిపోతుంది..! ఎక్కడ నేరం జరిగినా పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకుని నేరగాళ్లకు సంకెళ్లు వేస్తారు. కానీ అంత హై టెక్నాలజీ ఉన్న నగరంలో భారీ దోపిడీ జరిగింది. ఆ దోపిడీ జరిగింది కూడా ఏ సందులోనో, గొందిలోనో కాదు. ప్రధాన రహదారి వెంట ఉండే ప్రముఖ నగల దుకాణంలో. బయటి నుంచి కన్నం వేసి ముగ్గురు దొంగలు ఒకరి వెంట ఒకరు దుకాణంలో ప్రవేశించారు.
వెంట తెచ్చుకున్న పనిముట్లతో చకాచకా దుకాణంలోని గ్లాస్ డోర్లను పగులగొట్టారు. చేతికి అందినకాడికి నగలను మూటగట్టుకుని క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఈ దోపిడీ చోటుచేసుకుంది. మ్యాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూకు చెందిన 400 బ్లాక్‌లోగల సెల్లినీ జ్యుయెలరీలో జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలు.. ఆ దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దోపిడీ దొంగలు మొత్తం రూ.4 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దొంగలు ముఖాలకు ముసుగులు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి ఉన్నారని, దోపిడీ అనంతరం పురుగున వెళ్లి బయట సిద్ధంగా ఉన్న వాహనంలో పరారయ్యారని పోలీసులు తెలిపారు. దొంగల కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
🚨WANTED🚨for a Burglary@ 430 Park Avenue (Cellini Jewelers) @NYPDMTN #Manhattan on 10/15/22@ 3:33A.M., Once inside, the 3 individuals took high end jewelry estimated value is over $500,000.💰Reward up to $3500 Know who they are?📲Call 1-800-577-TIPS Calls are CONFIDENTIAL! pic.twitter.com/9SfugfcE3O
— NYPD Crime Stoppers (@NYPDTips) October 16, 2022