Haj Yatra | శ్రీనగర్: భారత ప్రైవేట్ హజ్ కోటాను 80 శాతం తగ్గిస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంపై జమ్మూకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 52,000 మంది భారత హజ్ యాత్రికులకు హజ్ స్లాట్స్‌ను రద్దు చేయడం ఆందోళనకరమని చెప్పారు.
సౌదీ అధికారులను సంప్రదించాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఎక్స్ వేదికగా ఒమర్ కోరారు. ఈ పరిణామాల వల్ల యాత్రికులు, టూర్ ఆపరేటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ముఫ్తీ ఎక్స్‌లో స్పందించారు. వెంటనే విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని, సౌదీ ప్రభుత్వంతో సంప్రదించి, పరిష్కారం కోరాలని డిమాండ్ చేశారు.