న్యూఢిల్లీ : పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కనుక పాకిస్థాన్‌పై దాడిచేస్తే, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు, మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ రైఫిల్స్ (ప్రస్తుతం బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) మాజీ అధిపతి అయిన మేజర్ జనరల్ (రిటైర్డ్) ఏఎల్ఎం ఫజ్లూర్ రెహ్మాన్ ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సంయుక్త సైనిక వ్యవస్థ కోసం చైనాతో బంగ్లాదేశ్ మాట్లాడాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్లో బెంగాలీలో పోస్టు చేశారు.