బీజింగ్: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un).. చైనా ట్రిప్‌కు వెళ్లారు. బీజింగ్‌లో జరుగనున్న మిలిటరీ పరేడ్‌ను తిలకించేందుకు ఆయన ప్రయాణం చేపట్టారు. అయితే తనకు చెందిన బుల్లెట్‌ప్రూఫ్ రైలులో ఆయన ప్రయాణిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ నుంచి సోమవారం రాత్రి ఆ రైలులో బయలుదేరి వెళ్లారు. ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి చోయి సోన్ హుతో పాటు ఇతర సీనియర్ నేతలు ఆయనతో కలిసి వెళ్లారు. ఇవాళ సాయంత్రం వరకు బీజింగ్‌కు ఆ రైలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 2023లో రష్యాలో కిమ్ పర్యటించారు. ఆ తర్వాత తొలిసారి ఆయన మళ్లీ విదేశీ టూర్‌కు వెళ్లారు. 2019 తర్వాత చైనాకు కిమ్ తొలిసారి వెళ్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం 80వ వార్సికోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌ను కిమ్ తిలకిస్తారు.