Nobel Prize | రసాయన శాస్త్రం (Chemistry)లో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి (Nobel Prize) వరించింది. మెటల్ అర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌ను అభివృద్ధి చేసినందుకు గాను జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన సుసుము కిటగావా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికాకు చెందిన ఒమర్ ఎం. యాఘీలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) బుధవారం ప్రకటించింది.
కాగా, గతేడాది కూడా ఈ విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ దక్కింది. ప్రొటీన్లపై జరిపిన పరిశోధనలకు గానూ డెమిస్ హసాబిస్, జాన్ జంపర్, డేవిడ్ బేకర్‌కు ఈ బహుమతి లభించింది. మొత్తంగా 1901-2024 మధ్యకాలంలో 116 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించగా ఇప్పటివరకు 195 మంది దీనిని అందుకున్నారు.
కాగా, స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నెబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే వైద్య, భౌతిక శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2025 #NobelPrize in Chemistry to Susumu Kitagawa, Richard Robson and Omar M. Yaghi “for the development of metal–organic frameworks.” pic.twitter.com/IRrV57ObD6— The Nobel Prize (@NobelPrize) October 8, 2025
Also Read..
“Sundar Pichai | అదృష్టంగా భావిస్తున్నా.. వారికి నోబెల్ బహుమతి వరించడంపై సుందర్ పిచాయ్ ఆనందం”
“క్వాంటమ్ మెకానిక్స్‌పై పరిశోధనకు భౌతిక నోబెల్”
“రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనకు వైద్య నోబెల్”