Ukraine | ఉక్రెయిన్‌కు బైడెన్ వెళ్లడంలేదు.. స్పష్టం చేసిన వైట్ హౌస్
రష్యాతో ఎడతెగని యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పలు పాశ్చాత్య దేశాలు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరికి అగ్రరాజ్యం అమెరికా పూర్తి సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాధినేతలు ఉక్రెయిన్‌లో పర్యటించి తమ ఆ దేశానికి తమ మద్దతు తెలిపారు. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లి మద్దతు తెలుపుతారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కీవ్‌లో బైడెన్ పర్యటించబోవడం లేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన పలువురు కీలక నేతలు కీవ్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను తమ దేశానికి రావలసిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానించాడు. దీనిపై జెన్ సాకి స్పందిస్తూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బైడెన్‌ను పంపే యోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

