న్యూయార్క్, డిసెంబర్ 6: ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంలో జరుగుతున్న పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలను అందిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు న్యూయార్క్‌కు చెందిన వాతావరణ సాంకేతిక స్టార్టప్ ఎయిర్సెలా మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. గాలి ద్వారా గ్యాసోలిన్ అనే ఇంధనాన్ని ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది.
గ్యాసోలిన్ వాహనాలను నడిపించే ఇంధనంగా పని చేస్తుంది. ఇటీవల కంపెనీ ప్రతినిధులు ఆ యంత్రాన్ని ప్రదర్శించారు. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించి.. దానిని డ్రాప్‌ఇన్ సింథటిక్ గ్యాసోలిన్‌గా మార్చడం ఈ యంత్రం ప్రత్యేకత. గ్యాసోలిన్ ఉత్పత్తి రెండు దశలలో జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ముందుగా గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ను సేకరించే యంత్రం… నీటిలోని హైడ్రోజన్‌తో కలిపి లిక్విడ్ గ్యాసోలిన్‌ను తయారు చేస్తుంది.