న్యూఢిల్లీ: భారత దేశం కన్నా ముఖ్యమైన భాగస్వామి వేరొకటి లేదని భారత దేశానికి నూతన అమెరికా రాయబారి సెర్గియో గోర్ చెప్పారు. ఆయన సోమవారం ఈ పదవీ బాధ్యతలను చేపట్టారు. ఆయన మాట్లాడుతూ, తాను రాయబారిగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని చెప్పారు.
వచ్చే ఏడాది లేదా రెండేండ్లలో ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. సిలికాన్ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన పాక్స్ సిలికా కూటమిలో చేరాలని భారత్‌ను ఆహ్వానించారు.