China | బీజింగ్, అక్టోబర్ 25: ఆన్లైన్ పేమెంట్స్ విధానంలో చైనా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ఈ కొత్త విధానాన్ని ‘పామ్ పేమెంట్స్’ అంటున్నారు. ఇందుకోసం ముందుగా వినియోగదారులు పామ్ పేమెంట్స్ వ్యవస్థలో తన అరచేతిని రిజిస్టర్ చేసుకోవాలి.
దీనికి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. ఆ తర్వాత చైనాలోని అనేక ప్రాంతాల్లో, షాపింగ్ మాల్స్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక పరికరాలకు అరచేతిని చూపిస్తే చెల్లింపు పూర్తవుతుంది. ఇందుకు ఫోన్, పాస్వర్డ్ లాంటివి ఏమీ అవసరం లేవు. నిజానికి ఈ సాంకేతికతను బీజింగ్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లైన్, షెంజెన్ యూనివర్సిటీలో గత ఏడాదే అమలులోకి తెచ్చారు. ఇప్పుడు దేశమంతా ఈ సాంకేతికతను వాడుతున్నారు. తాజాగా, రాణా హమ్జా సైఫ్ అనే పాకిస్తానీ ఇన్ఫ్లూయెన్సర్ చైనా పర్యటనలో ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించి ఆయన పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్‌గా మారింది.