బెర్లిన్, సెప్టెంబర్ 17: యూరప్‌లో కొత్త రకం కొవిడ్ వేరియంట్ ‘ఎక్స్ఈసీ’ వేగంగా విస్తరిస్తున్నది. రెండు ఒమిక్రాన్ సబ్ వేరియెంట్స్ నుంచి పుట్టుకొచ్చిన హైబ్రిడ్ రకంగా ‘ఎక్స్ఈసీ’ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ రోగుల్లో కనపడిన జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, వంటి లక్షణాలే ఇందులోనూ కనపడుతున్నాయని తెలిసింది. ‘ఎక్స్ఈసీ’ తొలి కేసు జర్మనీలో ఈ ఏడాది జూన్‌లో బయటపడగా, ఇప్పటివరకు 13 దేశాలకు వైరస్ వ్యాప్తి చెందింది. దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ తీసుకోవటం చాలా అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు.. డెన్మార్క్, జర్మనీల్లో ‘ఎక్స్ఈసీ’ వేగంగా విస్తరిస్తున్నదని డాటా విశ్లేషకుడు మైక్ హానీ చెప్పారు.