Covid-19 New Variant | కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తొలగిపోలేదు. తాజాగా న్యూ కోవిడ్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లో తొలుత బయట పడింది. కోవిడ్-19 వేరియంట్లన్నింటికంటే వేగంగా ఈ న్యూ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ వేరియంట్‌కు ఎక్స్ఈ అని పేరు పెట్టింది. ఒమిక్రాన్ బీఏ.2, బీఏ`1 స్ట్రెయిన్ల రీకాంబినేషనే ఈ ఎక్స్ఈ అని తెలిపింది.
కోవిడ్ సోకిన పలు రోగుల నుంచి రీ కాంబినెంట్ మ్యుటేషన్లు వస్తాయి. వివిధ వేరియంట్ల జెనిటిక్స్ మిక్సయిన ప్రతిరూపంగా కొత్త మ్యుటేషన్ పుట్టుకొచ్చిందని వైద్య నిపుణులు చెప్పారని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 కంటే 10 శాతం ఎక్కువగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
గత జనవరి 19న బ్రిటన్‌లో న్యూ వేరియంట్ వెలుగు చూసింది. 637 ఎక్స్ఈ న్యూవేరియంట్ కేసులు నమోదయ్యాయని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 శరవేగంగా వ్యాప్తిస్తుందని నిపుణులు తెలిపారు.
గత నెల 26 నాటికి బ్రిటన్‌లో కొత్తగా 49 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బీఏ.2 వేరియంట్‌తో అమెరికా, చైనాలోనూ కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. చైనాలో గత నెలలో 1.04 లక్షల కేసులు రికార్డయ్యాయి. షాంఘై లేదా ఈశాన్య జిలిన్ రాష్ట్ర పరిధిలో 90 శాతం కేసులు వెలుగు చూశాయి.