పక్షం రోజులకు ఒకసారి జీతం!.. నేపాల్ ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై పక్షం రోజులకు ఒకసారి జీతం చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజల వ్యయాన్ని స్థిరీకరించి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది.
కాఠ్మాండూ: ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై పక్షం రోజులకు ఒకసారి జీతం చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజల వ్యయాన్ని స్థిరీకరించి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల నెల జీతాన్ని రెండు భాగాలుగా చేసి 15 రోజులకు ఒకసారి అందిస్తారు. దీనివల్ల సమయానికి ఉద్యోగుల చేతుల్లో డబ్బు ఉంటుందని.. ఇది వారిని ఆర్థిక వ్యవస్థలో డబ్బును ఖర్చు పెట్టేలా ప్రోత్సహిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఇలా ప్రజల చేతుల్లో తరచూ డబ్బును ఉంచడం ద్వారా వినియోగ డిమాండ్ నెల ప్రారంభంలోనే గరిష్ఠ స్థాయికి చేరి తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టకుండా నెల పొడవునా స్థిరంగా కొనసాగుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇది మధ్య తరగతికి చెందిన ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల చిరు వ్యాపారులూ లాభపడతారని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

