Mount Everest | కాఠ్మాండూ: ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ రుసుమును నేపాల్ ఒక్కసారే భారీగా 36 శాతం పెంచింది. దాంతో పాటు ఆ శిఖరంపై చెత్త, కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
ఆ దేశ కొత్త పర్వతారోహణ నిబంధనల ప్రకారం ఇకపై సాధారణ దక్షిణ మార్గం నుంచి వసంత కాలంలో(మార్చి-మే) ఎవరెస్ట్ ఎక్కాలనుకొనే విదేశీయులు రాయల్టీ రుసుముగా 15,000 డాలర్లు(సుమారు రూ.13 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. శరత్కాలంలో(సెప్టెంబర్-నవంబర్)లో అయితే 7,500 డాలర్లు(రూ.6.48 లక్షలు) చెల్లించాలి. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫీజులు అమలవుతాయి.