Nepal | నేపాల్ (Nepal)లో అవినీతిపై కదం తొక్కిన నేపాల్ యువత. మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. రాజధాని కాఠ్మాండూ, ఇతర ప్రధాన నగరాల్లోని మంత్రుల నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. తాజాగా ఆ దేశ ఆర్థిక మంత్రి (Nepal finance minister), డిప్యూటీ ప్రధాని బిష్ణు ప్రసాద్ పౌడేల్ (Bishnu Prasad Paudel)పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. కాలితో తన్ని, వీధుల్లో పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రాణ భయంతో పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని వెంబడించి మరీ చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Nepal finance minister hetting flying kick #nomorecorruption #GenZProtest #genznepal pic.twitter.com/m4MuVmc6nF
— Manic (🍊,💊) (@WizardManic) September 9, 2025
మరోవైపు భక్తపూర్ (Bhaktapur)లోని ప్రధాని కేపీ శర్మ ఓలి (PM K.P. Sharma Oli) ప్రైవేట్ నివాసంపై దాడి చేసిన నిరసనకారులు.. దానికి నిప్పు పెట్టారు. అనంతరం డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యువత ఆందోళనలతో రాకీయ సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగడంతో నేపాలీ ప్రధాని ఈ మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఆయన దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇవాళ సాయంత్రం కొత్త ప్రధాని (New Pirme Minister) ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read..
Nepal | రణరంగంగా హిమాలయ దేశం.. నేపాల్‌లోని భారతీయుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు
India-Nepal border | భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్