Nepal floods : నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు 178 మందికిపైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. వందల మంది గల్లంతయ్యారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే, ఉన్నట్లుండి ఈ స్థాయిలో ఆకస్మిక వరదలు సంభవించడానికి గల కారణాలపై చర్చ జరుగుతోంది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చైనాపై కూడా నేపాల్ ఆరోపణలు చేస్తోంది. చైనా నిర్మిస్తున్న డ్యామే ఇందుకు కారణమని నేపాల్ ఆరోపిస్తోంది.
అంతేకాదు.. ఈ వరదల్ని ముందుగానే గుర్తించి, హెచ్చరించే టెక్నాలజీ చైనా వద్ద ఉన్నప్పటికీ.. తమకు సమాచారం ఇవ్వలేదని కూడా చైనా ఆరోపిస్తోంది. నేపాల్ వాదన ప్రకారం.. చైనా సరిహద్దులో విపత్తుల్ని ముందుగా గుర్తించే టెక్నాలజీ ఆ దేశం వద్ద ఉంది. అంటే, నేపాల్-చైనా సరిహద్దులో తలెత్తిన ఈ వరదల్ని ముందుగా గుర్తించే టెక్నాలజీని చైనా కలిగి ఉంది. ఆ దేశంలో ఈ అంశంపై ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. కానీ, తమకు మాత్రం చైనా ఈ విషయాన్ని వెల్లడించలేదని నేపాల్ ఆరోపిస్తోంది.
ఒకవేళ చైనా ముందుగానే తమను హెచ్చరించి ఉంటే, ఇంత భారీ నష్టం తప్పేదని నేపాల్ అభిప్రాయపడుతోంది. చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని దాచిపెట్టిందని నేపాల్ ఆరోపిస్తోంది. తాము చైనా వల్ల నిరంతరం ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని నేపాల్ అభిప్రాయపడింది. చైనా చేస్తున్న చర్యల వల్ల తమ దేశం ఎందుకు నష్టపోవాలని నేపాల్ మేధావులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నేపాల్ చేసిన ఆరోపణల్ని చైనా ఖండించింది. ఈ మేరకు నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన చేసింది.
— Spokesperson Of Chinese Embassy In Nepal (@PRCSpoxNepal) August 27, 2026
‘‘చైనా వైపు సంభవించిన జియోలాజికల్ డిజాస్టర్ డ్యామ్ కారణంగా నేపాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి అనేది పూర్తి అబద్ధం. ఏదైనా భూకంపం లేదా భూకంపంలాంటి మంచు పర్వతం కూలిపోవడం వల్ల నేపాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ కారణంగానే నేపాల్లో ప్రజలు కొట్టుకుపోయారు. ఆరోపణలతో ఏం సాధించలేం. అదే సహకరించుకుంటే ప్రాణాలు కాపాడవచ్చు’’ అంటూ చైనా పేర్కొంది.