కాఠ్మాండూ: తన ‘నెట్వర్క్ మ్యాప్’లో జమ్ము కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ సంస్థ తాను చేసిన ఘోర తప్పిదానికి క్షమాపణలు తెలిపింది. బుధవారం ఆ సంస్థ సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్న మార్గ పటంలో ఈ తప్పు జరిగింది. దీంతో భారత్‌లోని నెటిజన్లు దీన్ని తీవ్రంగా విమర్శించారు.
కొన్ని గంటలకే బాయ్కాట్నేపాల్ఎయిర్లైన్స్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ మొదలైంది. దౌత్యపరంగా ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పలువురు భారత విదేశాంగ శాఖను, పౌర విమానయాన శాఖను కోరారు. దీంతో గురువారం నేపాలీ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్తూ ఒక ప్రకటన చేసింది.