e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News ద‌క్షిణాఫ్రికా దేశాధ్య‌క్ష పీఠంపై నెల్స‌న్ మండేలా.. చరిత్ర‌లో ఈరోజు

ద‌క్షిణాఫ్రికా దేశాధ్య‌క్ష పీఠంపై నెల్స‌న్ మండేలా.. చరిత్ర‌లో ఈరోజు

కెపెటౌన్ : వర్ణవివక్షకు వ్యతిరేకంగా 27 ఏండ్ల‌పాటు జైలు శిక్ష అనుభవించి నెల్స‌న్ మండేలా దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా 1994 లో స‌రిగ్గా ఇదేరోజున‌ ఎన్నిక‌య్యారు. మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా దక్షిణాఫ్రికాలో కొత్త శకాన్ని ప్రకటించారు. మండేలా పుట్టినరోజును వర్ణవివక్ష నిర్మూలనకు చిహ్నంగా జరుపుకుంటారు.

నెల్స‌న్ మండేలా 1918 జూలై 18 న దక్షిణాఫ్రికాలోని బాసా నది ఒడ్డున ట్రాన్స్కిలోని మెర్వాజో గ్రామంలో జన్మించారు. ప్రజలు అతన్ని మాడిబా అని ఆప్యాయంగా పిలిచేవారు. వర్ణవివక్ష వ్యతిరేక జ‌రిపిన పోరాటంలో మండేలాను రాబెన్ ద్వీపంలో అప్ప‌టి ప్రభుత్వం 27 సంవత్సరాల‌పాటు జైలులో పెట్టింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌ను బొగ్గు గనిలో పని చేయించారు. జైలులోని చాలా చిన్న‌ గదిలో ఉండి చాప మీద ప‌డుకుని జైలు జీవితాన్ని గ‌డిపారు.

- Advertisement -

జాతి వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాటాన్ని ప్రారంభించిన నెల్సన్ మండేలా.. గాంధీ మ‌హాత్ముడి మాదిరిగానే అహింసా మార్గంలోనే నిర‌స‌న‌లు కొన‌సాగించాడు. చివ‌ర‌కు ప్ర‌భుత్వం దిగిరాక త‌ప్ప‌లేదు. 27 ఏండ్ల జైలు జీవితం నుంచి ఆయ‌న‌కు విముక్తి క‌ల్పించింది. ఈయ‌న పుట్టిన‌రోజును ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2009 జూలై 18 న ‘మండేలా దినం’ గా ప్రకటించింది.

మండేలా సేవ‌ల‌కు గుర్తింపుగా 1990 లో భార‌త‌దేశ అత్యున‌త పుర‌స్కారం భార‌త‌ర‌త్న అందించి స‌త్క‌రించారు. భార‌తర‌త్న అందుకున్న తొలి విదేశీయుడుగా మండేలా చ‌రిత్ర సృష్టించారు. 1993 లో ఆయనకు శాంతి నోబెల్ బహుమతి లభించింది. 95 సంవత్సరాల వయసులో 2013 డిసెంబర్ 5 న అనారోగ్యం కారణంగా నెల్స‌న్ మండేలా మరణించారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2011: హానర్ కిల్లింగ్ హంతకులకు మరణశిక్ష విధించాలని సుప్రీంకోర్టు సిఫారసు

1993 : ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తాన్ని రెండో సారి అధిరోహించిన మ‌హిళ‌గా సంతోష్ యాద‌వ్ చ‌రిత్ర‌

1972: నెవాడాలో అణు పరీక్ష నిర్వహించిన అమెరికా

1959: ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న సోవియట్ సైన్యం

1945: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌ను స్వాధీన‌ప‌ర్చుకున్న‌ రష్యన్ సైన్యం

1916: నెదర్లాండ్స్ రాజధాని ఆమెస్ట‌ర్‌డామ్‌లో షిప్ పోర్ట్ మ్యూజియం ప్రారంభం

1857 : బ్రిటిష్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మీర‌ట్ కంటోన్మెంట్ కేంద్రంగా ఉద్య‌మం ప్రారంభం

1796: లోడి వంతెన యుద్ధంలో ఆస్ట్రియాను ఓడించిన నెపోలియన్

1655: జమైకాను స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ దళాలు

1503: కేమాన్ ద్వీపాన్ని కనుగొన్న ఇటాలియన్ నావికుడు కొలంబస్

1427: స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరం నుంచి యూదుల బహిష్కర‌ణ‌

ఇవి కూడా చ‌ద‌వండి..

కేపీ ఒలి విశ్వాస ప‌రీక్ష‌కు అడ్డంకిగా క‌రోనా..!

వ‌చ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవ‌లు

అమెరికా ఆకాశంలో గుర్తుతెలియ‌ని వ‌స్తువులు.. నిజానికి అవేంటంటే..!

రెమ్‌డెసివిర్ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వైద్యుడు.. వీడియో వైర‌ల్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement