Mark Rutte | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందుకు వచ్చిన ఎలాంటి అవకాశాన్నీ వదలడం లేదు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు (Russian oil) చేస్తోందన్న కారణంగా భారత్‌పై అధిక టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. అయితే, న్యూ ఢిల్లీపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు (US Tariff Impact) రష్యాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నాటో సెక్రటరీ జనరల్ (NATO Secretary-General) మార్క్ రుటె (Mark Rutte) అన్నారు.
‘రష్యా నుంచి చమురు కొంటోందన్న కారణంగా భారత్‌పై ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సుంకాలతో భారత్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. దీంతో రష్యా అధినేతకు ఢిల్లీ నుంచి ఫోన్ వెళ్తోంది. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహంపై మోదీ ఆరా తీస్తున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు’ అని మార్క్ రుటె వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. అయితే, రుటె వ్యాఖ్యలపై భారత్ ఇప్పటి వరకూ స్పందించలేదు.
“Delhi is on phone with Vladimir Putin in Moscow, & Narendra Modi asking, hey I support you but could you explain to me the strategy bcz I have been hit with 50% tariffs. Prez Trump is implementing what he says”
NATO Secretary-General Mark Ruttepic.twitter.com/63cEh4CxNZ
— Sidhant Sibal (@sidhant) September 26, 2025
Also Read..
MiG-21 Fighter jet | రిటైర్ అయిన మిగ్-21 ఫైటర్ జెట్స్.. 62 ఏళ్ల సేవలకు గుడ్‌బై చెప్పిన వాయుసేన