న్యూయార్క్, జూన్ 23: ఓ గ్రహశకలం భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2038 జూలై 12న ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం చాన్స్ ఉన్నదని వెల్లడించారు.
జూన్ 20న నాసా మేరీల్యాండ్‌లోని జాన్ హోప్కిన్స్ ఐప్లెడ్ ఫిజిక్స్ లాబరేటరీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకా 14.25 ఏండ్ల సమయం ఉన్నందున దాన్ని దారి తప్పించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.