గొరిల్లా.. ఈ పేరు చెప్పగానే అంతెత్తున భారీ కాయంతో ఉండే జీవులు గుర్తొస్తాయి. అడవంతా ఉలిక్కిపడేలా గర్జిస్తూ, గుండెలు పగిలేలా చాతీపై బాదుకుంటూ అవి వస్తుంటే ఏ జీవికైనా వణుకు పుట్టాల్సిందే. కానీ ఈ భయంకరమైన జీవులు కూడా పసితనం నుంచి ఎదగాల్సిందే కదా. ఆ పసితనంలో ప్రతి పని మొదటి సారి చేసినప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో అదే కనిపిస్తోంది.
ఒక గొరిల్లా పిల్ల రెండు కాళ్లపై నిలబడి, గుండెలపై బాదుకునేందుకు ప్రయత్నించింది. కానీ అదంతా తనకు కొత్త కావడంతో బ్యాలెన్స్ తప్పి వెనక్కు పడిపోయింది. కిందకు పడిపోయిన తర్వాత పైకి లేచి బిత్తర చూపులు చూస్తుండిపోయింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇలా పడిపోయినా కూడా భవిష్యత్తులో అందర్నీ హడలెత్తిస్తుందీ బేబీ గొరిల్లా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
A baby gorillas first chest pound.. 😅 pic.twitter.com/vwpgnmZ02D
— Buitengebieden (@buitengebieden) October 24, 2022