న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా దాతృత్వశీలుర జాబితాను విడుదల చేసింది. 2025 ఏడాదికిగానూ దాతృత్వంలో టాప్-100 జాబితాలో మన దేశం నుంచి పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, విప్రో మాజీ చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ, జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్లకు స్థానం లభించింది. అంబానీ దంపతులు 2024లో రూ.407 కోట్లను విరాళంగా ఇచ్చి దేశంలోనే అతిపెద్ద దాతలుగా నిలిచారు.
విద్య, గ్రామీణ అభివృద్ధి రంగాలకు భారీ స్థాయిలో విరాళాలు అందిస్తూ అజిమ్ ప్రేమ్జీ దాతృత్వంలో ముందున్నారు. ఇక యువ భారతీయులను దాతృత్వాన్ని ప్రోత్సహించేలా నిఖిల్ కామత్ ‘గివింగ్ ప్లెడ్జ్’ వంటి వినూత్న సామాజిక దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.