Hajj Pilgrims | హజ్ యాత్రలో మృత్యుఘోష.. ఈ ఏడాది 550 మంది యాత్రికులు మృతి..!
Hajj Pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ముగింపు దశకు చేరుకుంది. అయితే, ఈ సారి ఈ పవిత్ర యాత్ర మృత్యుఘోషగా మారింది.
Hajj Pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ముగింపు దశకు చేరుకుంది. అయితే, ఈ సారి ఈ పవిత్ర యాత్ర మృత్యుఘోషగా మారింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్ యాత్రికులు (Hajj Pilgrims) అల్లాడిపోతున్నారు. ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ వేడికి తాళలేక ఇప్పటి వరకూ 550 మంది హజ్ యాత్రికులు మరణించినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి.
మరణించిన వారిలో ఈజిప్ట్, జోర్దాన్ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు (Egyptians) కాగా, 60 మంది జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. మంగళవారం వరకూ ఈ యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణమే అందుకు కారణంగా తెలిపారు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు.
ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన అల్-ముయిసెమ్ ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, గతేడాది హజ్ యాత్రలో 240 మంది యాత్రికులు చనిపోయారు. వారాలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్లు సౌదీ మీడియా తెలిపింది.
Also Read..
Earthquake | ఇరాన్‌ను వణికించిన భూకంపం.. నలుగురు మృతి
North Korea: పుతిన్‌కు రెడ్‌కార్పెట్.. గ్రాండ్ వెల్కమ్ పలికిన కిమ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

