మాస్కో: మారియపోల్ నగరంలో సుమారు 1026 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా పేర్కొన్నది. మారియపోల్లో కొన్ని వారాల నుంచి భీకర దాడులు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ నగరం రష్యా ఆధీనంలోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లిచీ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ వద్ద ఉన్న 36వ మెరైన్ బ్రిగేడ్ గ్రూపు సరెండర్ అయినట్లు తెలుస్తోంది. సైనికుల లొంగిపోయినట్లు వస్తున్న సమాచారం తమకు తెలియదని ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రతినిధి ఒలెక్జాండర్ మొటుజైనిక్ తెలిపారు. అయితే మారియపోల్లో వేలాది మంది మృతి చెందినట్లు ఇటీవల ఆ నగర మేయర్ తెలిపారు.