సాధారణంగా కోతులంటేనే చిలిపి పనులు చేస్తాయి. వాటి చేష్టలను తట్టుకోవడం ఎవరి తరం కాదు. ఈమధ్య కోతులు అడవుల్లో కంటే ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కోతుల మందే. మన చేతుల్లో ఏదైనా కనిపిస్తే చాలు.. మీద ఎగబడి మరీ లాగేసుకుంటాయి. గుటుక్కున నోట్లో వేసుకుంటాయి. అంతే కాదు.. వాటికి ఎదురు తిరిగితే మీద పడి దాడి చేస్తాయి కూడా. ఇప్పటి వరకు కోతుల దాడిలో చనిపోయిన వాళ్లూ ఉన్నారు. తాజాగా రెండు కోతులు కలిసి సృష్టించిన వీరంగం మామూలుగా లేదు. ఈ వీడియో చూస్తే పడిపడి నవ్వుకుంటారు.
ఈ ఘటన గిబ్రల్టార్ అనే దేశంలో చోటు చేసుకుంది. ఆ దేశంలో అలొన్సో సొసా అనే ఒక టూరిస్ట్ స్పాట్ ఉంటుంది. అక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. అక్కడ కోతులు కూడా తిష్ట వేశాయి. టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్లు ఏదైనా తినడానికి ఇస్తారని.. అక్కడే తిరుగుతుంటాయి.
ఒకవేళ ఎవ్వరూ తినడానికి ఏం ఇవ్వకపోతే.. వాళ్ల మీద ఎగబడటానికి కూడా రెడీగా ఉంటాయి. తాజాగా ఇద్దరు టూరిస్టులపై రెండు కోతులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ తలపై కూర్చొని తన వెనుక ఉన్న బ్యాగ్‌ను ఓపెన్ చేసేందుకు కోతి తిప్పలు పడింది. ఇంతలో మరో టూరిస్ట్ దాన్ని భయపెట్టబోయాడు కానీ.. అదే అతడిని భయపెట్టింది. అసలు ఆ కోతులు ఎందుకు దాడి చేశాయో… ఆ తర్వాత టూరిస్టులు ఏం చేశారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.