వాషింగ్టన్, జూలై 28 : లోహాలను బంగారంగా మార్చే సరికొత్త పద్ధతిని కనుగొన్నట్టు అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ‘మారథాన్ ఫ్యుజన్’ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. అణు భౌతిక శాస్త్రం, ఫ్యుజన్ టెక్నాలజీ (కేంద్రక సంలీనం)లో సాధించిన పురోగతితో ఈ కలను నిజం చేసే అవకాశముందని సదరు స్టార్టప్ కంపెనీ సైంటిస్టులు చెబుతున్నారు.
న్యూక్లియర్ ఫ్యుజన్ రియాక్టర్లో ఉత్పత్తి అయ్యే నూట్రాన్ రేడియేషన్(అంతులేని శక్తి)ను మెర్క్యూరీ-198 అనే ఐసోటోప్లపై ప్రయోగించి, ఫలితంగా రేడియోధార్మికమైన మెర్క్యూరీ-197ని సృష్టిస్తారు. ఇది ఆ తర్వాత సహజ లక్షణాలుండే స్థిరమైన బంగారంగా మారుతుంది.