e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News వ్యాక్సిన్ మిక్సింగ్‌తో ఫుల్ యాంటీబాడీలు : సౌమ్యా స్వామినాథ‌న్‌

వ్యాక్సిన్ మిక్సింగ్‌తో ఫుల్ యాంటీబాడీలు : సౌమ్యా స్వామినాథ‌న్‌

వ్యాక్సిన్ మిక్సింగ్‌తో  ఫుల్ యాంటీబాడీలు :  సౌమ్యా స్వామినాథ‌న్‌

జెనీవా: మార్కెట్లో వేరువేరు కంపెనీల కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రెండు డోసులు ఒక కంపెనీ టీకా వేసుకుంటున్నారు. అయితే ఒక‌వేళ రెండు వేరువేరు కంపెనీల టీకాలను తీసుకుంటే ఎలా ఉంటుంది. వ్యాక్సిన్ల‌ను మిక్స్ చేయ‌డం వ‌ల్ల ఎక్కువ సంఖ్య‌లో యాంటీబాడీలు ఉత్ప‌త్తి అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. వివిధ కొత్త వేరియంట్ల ప‌ట్ల కూడా టీకా మిక్సింగ్ ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు. హెటిరోలోగ‌స్ ప్రైమ్ బూస్ట్ కాన్సెప్ట్ వ‌ర్కౌట్ అయిన‌ట్లు ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.

మీడియాతో మాట్లాడుతూ ఆమె మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. ఇప్ప‌టికే ఒక డోసు తీసుకుని, ఆ టీకాకు చెందిన రెండ‌వ డోసు కోసం ఎదురుచూస్తున్న దేశాలు.. మరో కంపెనీ టీకా వేసుకునే సౌల‌భ్యం ఉంటుంద‌ని స్వామినాథ‌న్ తెలిపారు. బ్రిట‌న్‌, స్పెయిన్‌, జ‌ర్మ‌నీ దేశాల నుంచి వ‌స్తున్న డేటా వ్యాక్సిన్ మిక్సింగ్‌పై ఆశ‌లు రేపుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. కానీ మిక్సింగ్ వ‌ల్ల ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న‌ట్లు తేలింది. నొప్పి, జ్వ‌రంతో పాటు ఇత‌ర సైడ్ ఎఫెక్ట్స్ కొంత ఎక్కువ‌గా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. ప్రైమ్ బూస్ట్ విధానం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మ‌రింత బ‌ల‌ప‌డుతోంద‌ని, దీంతో అధిక స్థాయిలో యాంటీబాడీలు, తెల్ల ర‌క్త క‌ణాలు ఉత్ప‌త్తి అవుతున్నాయ‌ని, అవి వైర‌స్‌ను చంపేస్తున్నాయ‌న్నారు.

- Advertisement -

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు కొన్ని దేశాలు రెండు వేరువేరు డోసుల‌ను ఇస్తున్నారు. మ‌లేషియాలో ఒక డోసు ఆస్ట్రాజెనికా టీకా, మ‌రో డోసు ఫైజ‌ర్ టీకాను ఇస్తున్నారు. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు వేగంగా వ్యాక్సినేష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆ దేశ మంత్రి ఖైరీ జ‌మాలుద్దిన్ తెలిపారు. అయితే కొత్త వేరియంట్ల‌ను ఎదుర్కొనేందుకు బూస్ట‌ర్ టీకా అవ‌స‌రంపై ఇంకా ఎటువంటి స‌మాచారం లేద‌ని ఆమె అన్నారు. ఇంకా అనేక దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభంకాలేద‌ని, ఇప్పుడే ఆ విష‌యాన్ని చెప్ప‌లేమ‌న్నారు.

బ్రిట‌న్‌లో మాత్రం కోవిడ్ బూస్ట‌ర్ టీకాల‌ను అందుబాటులోకి తెస్తున్నారు. శీతాకాలంలో వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బూస్ట‌ర్ టీకాల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి మ్యాట్ హాన్‌కాక్ తెలిపారు. ఇంగ్లండ్‌లో ఏడు ర‌కాల బూస్ట‌ర్ టీకాల‌ను ప‌రిశీలిస్తున్నారు. డెల్టా వేరియంట్ ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్‌గా మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సౌమ్యా తెలిపారు. డెల్టా వేరియంట్ చాలా వేగంగా విస్త‌రిస్తోన్న‌ట్లు ఆమె తెలిపారు. వేరు వేరు వేరియంట్ల ప‌ట్ల వినియోగిస్తున్న వివిధ వ్యాక్సిన్ల డేటా ఇంకా అందాల్సి ఉంద‌న్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యాక్సిన్ మిక్సింగ్‌తో  ఫుల్ యాంటీబాడీలు :  సౌమ్యా స్వామినాథ‌న్‌
వ్యాక్సిన్ మిక్సింగ్‌తో  ఫుల్ యాంటీబాడీలు :  సౌమ్యా స్వామినాథ‌న్‌
వ్యాక్సిన్ మిక్సింగ్‌తో  ఫుల్ యాంటీబాడీలు :  సౌమ్యా స్వామినాథ‌న్‌

ట్రెండింగ్‌

Advertisement