న్యూఢిల్లీ, ఆగస్టు 11: గూగుల్ ఇమేజెస్‌లో సెర్చ్ చేసేప్పుడు తమ ఫొటోలు, తల్లిదండ్రుల ఫొటోలు రావొద్దని కోరేలా 18 ఏండ్ల కంటే తక్కువ ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని గూగుల్ వెల్లడించింది. వచ్చే కొన్నివారాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపింది. అంతే కాకుండా, 18 ఏండ్ల కంటే తక్కువ వయస్సున్న వారి జీమెయిల్ ఖాతాలు. కావాలని ఆన్ చేస్తే తప్ప లొకేషన్ హిస్టరీ ఆఫ్‌లో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.