టెల్ అవీవ్ : ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ కూటమిలోని కీలక మిత్ర పక్షం షాస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించింది. దీంతో ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడింది.
మతపరమైన సెమినరీలలో చదువుకునేవారికి మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ నుంచి మినహాయించే అవకాశం లేకుండా రూపొందించిన ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ షాస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వీరికి సైన్యం నుంచి మినహాయింపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.