మెక్సికో : మెక్సికో నగరంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలు వంతెన ప్రమాదవశాత్తు కూలిపోవడంతో రైలు బోగీలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మెట్రో రైలు వంతెన కింద ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఘటనాస్థలిని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బౌం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని మేయర్ అధికారులను ఆదేశించారు.
#ULTIMAHORA: Nuevo accidente en el metro de #CDMX.
— Carlos Zúñiga Pérez (@Carloszup) May 4, 2021
Un vagón de la línea 12 cayó del viaducto entre las estaciones Tezonco y Olivos. pic.twitter.com/NSn9gooUiD
#ATENCIÓN | Este es el momento en que el Metro de la Línea 12 cayó luego de que una trabe de la vía se derrumbara. 👉🏼 https://t.co/DWxdVAANpq pic.twitter.com/DPtJ8Uc2Bp
— El Heraldo de México (@heraldodemexico) May 4, 2021