Gold Bag | మరిచిపోయిన బంగారం బ్యాగును భక్తుడికి అప్పగించిన టీటీడీ సిబ్బంది
Gold Bag | తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద బంగారం బ్యాగు ను మరిచిపోయిన భక్తుడికి టీటీడీ తిరిగి అప్పగించింది.
తిరుపతి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద బంగారం బ్యాగు ( Gold Bag ) ను మరిచిపోయిన భక్తుడికి టీటీడీ ( TTD ) తిరిగి అప్పగించింది. భద్రతా తనిఖీల సందర్భంగా హైదరాబాద్ ( Hyderabad )కు చెందిన మహేష్ అనే భక్తుడు అనుకోకుండా బ్యాగును అక్కడే మరిచిపోయాడు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును ఆధీనంలోకి తీసుకుని పరిశీలించగా, అందులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి మహేష్‌కు చెందిన బ్యాగుగా గుర్తించారు. అప్పటికే తాను బ్యాగును మరిచిపోయిన విషయాన్ని కూడా గుర్తించని భక్తుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించి, పూర్తి వివరాలను ధృవీకరించిన అనంతరం బ్యాగును భద్రంగా అప్పగించారు. టీటీడీ యాజమాన్యానికి, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, అప్రమత్తత, సేవాభావాన్ని భక్తుడు మహేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

