దేవరకొండ రూరల్, జూలై 22 : దేవరకొండ మండలం కాచారం గ్రామానికి చెందిన ముదిగొండ సామెల్ మృతి బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం కాచారం గ్రామంలో నిర్వహించిన సామెల్ దశదిన కర్మ కార్యక్రమంలో రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు గోపాల్ గౌడ్, ముదిగొండ సంజీవ, బొడ్డుపల్లి కృష్ణ, ముదిగొండ హరిదాస్, బొడ్డు మల్లేష్, ముదిగొండ రాందాస్ పాల్గొన్నారు.