Turkey | ఇస్లాంబుల్ : తుర్కియే పార్లమెంటులో శుక్రవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత క్యాన్ అటలే పార్లమెంటు డిప్యూటీగా ఎన్నికయ్యారు. అయితే ఆయన 2013లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
పార్లమెంటుకు హాజరయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. రాజ్యాంగ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై శుక్రవారం పార్లమెంటులో జరిగిన చర్చ భౌతిక దాడులకు దారి తీసింది. వర్కర్స్ పార్టీ సభ్యుడిని అధికార పార్టీ సభ్యుడు కొట్టినట్లు వీడియోలో కనిపించింది. చివరికి ఓ మహిళా సభ్యురాలిని కూడా రక్తం కారేలా కొట్టారు. ఈ వీడియోలు వైరల్గా మారాయి.
JUST IN: 🇹🇷 Fight breaks out in Turkish Parliament
— BRICS News (@BRICSinfo) August 16, 2024