Melinda Gates | ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పీఠం కోసం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ (Melinda French Gates) స్పందించారు. ఈ ఎన్నికల్లో తన ఓటు ఎవరికో బహిరంగంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కే అని స్పష్టం చేశారు.
తాను ఇంతకు ముందు ఎన్నడూ అధ్యక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదని తెలిపారు. కానీ ఈ సారి ఎన్నికలు మహిళలు, కుటుంబాలకు చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. మహిళల భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక శక్తి, వ్యక్తిగత హక్కులను కాపాడే నాయకుడు కావాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలు పూర్తిగా భాగస్వాములయ్యే స్వేచ్ఛను కల్పించాలని పేర్కొన్నారు. గతంలో ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వ హయాంలో మహిళల ఆరోగ్యం, భద్రత, స్వేచ్ఛను ప్రమాదంలో పడేశారని విమర్శించారు. అందుకే ఈ సారి తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కే అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదిగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Also Read..
Dead Rat | కస్టమర్‌కు షాకింగ్ అనుభవం.. సాంబార్లో చచ్చిన ఎలుక.. VIDEO