బీజింగ్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ టీనేజ్ కుమార్తె కిమ్ జు ఆయే తొలిసారి విదేశీ పర్యటనలో కనిపించారు. ఈ నెల 2న ఆమె తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లారు. కిమ్ తో కలిసి ఆమె రైలులో బీజింగ్‌కు వెళ్లారు. వారికి చైనాలో ఘన స్వాగతం లభించింది.
చైనా విజయోత్సవాల సందర్భంగా జరిగే సైనిక కవాతుకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. ఈ హై ప్రొఫైల్ ఈవెంట్లో ఆమె పాల్గొనడాన్ని బట్టి కిమ్ జోంగ్ ఉన్‌కు భావి వారసురాలిగా ఆమెను పరిచయం చేస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె అధికారికంగా బహిరంగంగా కనిపించడం అదే మొదటిసారి.