వాషింగ్టన్ : భారీ మంచు తుఫాన్ ఆదివారం అమెరికాపై విరుచుకుపడింది. పరిస్థితి దిగజారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ర్టాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 3,200 కిలోమీటర్ల మేర భూమిని మంచు తుఫాన్ చుట్టుముట్టడంతో ఇప్పటివరకు 30 మంది మరణించినట్లు డైలీ మెయిల్ తెలిపింది. 2.10 కోట్ల మందికి పైగా ప్రజలు మంచు తుఫాన్ బారినపడినట్లు మీడియా తెలిపింది.
దాదాపు 10 లక్షల ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోగా 10,000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 14,000కుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికాలో మంచుతుపాను తాకిడికి తీవ్రంగా గురైన రాష్ర్టాల్లో టెన్నెసీ ప్రథమ స్థానంలో ఉన్నది.