ఇస్లామాబాద్ : కశ్మీర్లోని పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో జైషే మహ్మద్ టాప్ కమాండర్ మసూద్ అజర్ కుటుంబం బహవల్పూర్లో చిన్నాభిన్నం అయిపోయిందని జేఈఎం కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒప్పుకున్నారు.
భారత వాయుసేన వారి రహస్య స్థావరంలోకి చొరబడి ఎలా నాశనం చేసిందనే విషయాన్ని ఆయన ఒక బహిరంగ సభలో వెల్లడించారు. ఆవేశంతో ఉర్దూలో చేసిన ప్రసంగం వీడియో వైరల్ అయింది. ‘మే 7న బహవల్పూర్లో భారత దళాలు మౌలానా మసూద్ అజర్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని కాశ్మీరీ ఆవేశంతో పేర్కొన్నాడు.