Maryanne Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మేరియన్ ట్రంప్ బారీ (Maryanne Trump Barry) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86. సోమవారం తెల్లవారుజామున న్యూయార్క్ (New York) లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ది న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అయితే మేరియన్ మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
మేరియన్ 1974లో అసిస్టెంట్ అటార్నీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. యూఎస్ ఫెడరల్ జడ్జిగా పని చేసిన ఆమె.. 2019లో పదవీ విరమణ పొందారు. ట్రంప్‌కు మొత్తం నలుగురు తోబుట్టువులు. ఆగస్టు 2020లో ట్రంప్ సోదరడు రాబర్ట్ ట్రంప్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోదరి మేరియన్ ప్రాణాలు కోల్పోయారు. మేరియన్ తన తమ్ముడు ట్రంప్‌తో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. దీంతో సోదరి మృతితో డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read..
Elon Musk | కేంద్ర మంత్రికి క్షమాపణలు చెప్పిన ఎలాన్ మస్క్
Joe Biden | కమలా హారిస్‌ను ప్రెసిడెంట్ అని సంభోదించి.. మరోసారి నవ్వులపాలైన బైడెన్
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని సునాక్‌పై తొలి అవిశ్వాస లేఖ.. సొంత పార్టీ ఎంపీ నుంచే