Elon Musk | కేంద్ర మంత్రికి క్షమాపణలు చెప్పిన ఎలాన్ మస్క్
Elon Musk | కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal)కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) క్షమాపణలు (apologises) చెప్పారు.
Elon Musk | కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal)కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) క్షమాపణలు (apologises) చెప్పారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్ కార్ల తయారీ టెస్లా ప్లాంట్ (Tesla factory) ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని విద్యుత్ కార్ల తయారీని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్ (Fremont, California)లో గల అత్యాధునిక టెస్లా విద్యుత్ కార్ల తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ ప్రతిభావంతులైన భారతీయ ఇంజినీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ స్థానాల్లో పనిచేస్తున్నారు. వారిని చూడటం ఆనందాన్ని కలిగించింది. టెస్లా అద్భుత ప్రయాణంలో వారు అందిస్తున్న సహకారం చూసి చాలా ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు. అయితే, ఈ పర్యటనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను మిస్ అవుతున్నట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
Visited @Tesla’s state of the art manufacturing facility at Fremont, California.
Extremely delighted to see talented Indian engineers & finance professionals working at Senior positions and contributing to Tesla’s remarkable journey to transform mobility.
Also proud to see… pic.twitter.com/FQx1dKiDlf
— Piyush Goyal (@PiyushGoyal) November 14, 2023
పియూష్ గోయల్ పోస్ట్‌కు మస్క్ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శించడం గౌరవంగా ఉంది. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
It was an honor to have you visit Tesla!
My apologies for not being able to travel to California today, but I look forward to meeting at a future date.
— Elon Musk (@elonmusk) November 14, 2023
Also Read..
Joe Biden | కమలా హారిస్‌ను ప్రెసిడెంట్ అని సంభోదించి.. మరోసారి నవ్వులపాలైన బైడెన్
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని సునాక్‌పై తొలి అవిశ్వాస లేఖ.. సొంత పార్టీ ఎంపీ నుంచే
Vistara | రన్‌వేపైకి వచ్చిన వీధి కుక్క.. ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగిన విస్తారా విమానం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

