Vistara | రన్‌వేపైకి వచ్చిన వీధి కుక్క.. ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగిన విస్తారా విమానం
Vistara | గోవాలోని దబోలిమ్ ఎయిర్పోర్ట్ రన్‌వేపైకి వీధి కుక్క రావడంతో (Dog Enters Goa Airport Runway) విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ (Vistara Flight) ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగింది.
Vistara | గోవాలోని దబోలిమ్ ఎయిర్పోర్ట్ రన్‌వేపైకి వీధి కుక్క రావడంతో (Dog Enters Goa Airport Runway) విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ (Vistara Flight) ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే 881 ఫ్లైట్ కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Kempegowda International Airport) నుంచి సోమవారం మధ్యాహ్నం 12:55 గంటలకు బయలుదేరింది. ఆ విమానం 2 గంటలకు గోవాలోని దబోలిమ్ విమానాశ్రయం (Dabolim Airport in Goa)లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండ్ కావడానికి కొద్దిసేపు ముందు రన్‌వేపై వీధి కుక్కను గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. కాసేపు ల్యాండ్ చేయకుండా పైలట్‌ను ఆపినట్లు గోవా విమానాశ్రయం డైరెక్టర్ ఎస్వీటీ ధనుంజయరావు తెలిపారు.
అయితే, కాసేపటికి విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. 3:05 గంటల ప్రాంతంలో కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానం మళ్లీ బెంగళూరు నుంచి 4:55 గంటలకు బయలుదేరి 6:15 గంటలకు గోవా చేరుకుందని ఆయన వివరించారు. ఆ సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. విమానం గోవాలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు.
Also Read..
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని సునాక్‌పై తొలి అవిశ్వాస లేఖ.. సొంత పార్టీ ఎంపీ నుంచే
Bike Stunt | బైక్‌పై టపాసులు కాలుస్తూ ప్రమాదకర స్టంట్స్.. యువకుడి అరెస్ట్
Oberoi Chairman | ఆతిథ్యరంగ దిగ్గజం పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ కన్నుమూత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

