Bike Stunt | దీపావళి (Diwali) సందర్భంగా తమిళనాడు (Tamil Nadu)లో కొందరు రెచ్చిపోయారు. జాతీయ రహదారిపై బైక్‌పై టపాసులు పేల్చుతూ ( firecrackers ) ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.
ఓ యువకుడు తన బైక్ ముందు ఉన్న లైట్ భాగంలో టపాసులను అమర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టి రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ ముందు టైర్లను గాల్లోకి లేపి ప్రమాదకర స్టంట్స్ (Bike Stunt) చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నవంబర్ 9న సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసిన తిరుచ్చి పోలీసులు (Trichy Police) సదరు యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. యువకుడి బైక్ స్టంట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
எவனோ ஒருத்தன் ஆரம்பிச்சி வச்சான், இப்ப நிறைய பேரு இதே மாதிரி பைக்ல வெடி கட்டி வீடியோ போட ஆரம்பிச்சிட்டானுக. pic.twitter.com/cpofhXjV6W
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) November 12, 2023
కాగా, గత నెల హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాల్చాడు (Firecrackers). స్థానిక సైబర్ సిటీ ప్రాంతంలో గల గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో కారు డోర్ నుంచి బయటకు వచ్చి పైకప్పుపై (Cars Roof) టపాకులు పెట్టి కాల్చాడు. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఆ సమయంలో కారుకు నంబర్ ప్లేటు లేకపోవడం గమనార్హం. వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Unidentified persons booked for bursting crackers from their car: #Gurugram Police. #Viralvideo pic.twitter.com/MocAcsvlUx
— Akshara (@Akshara117) October 19, 2023
Also Read..
Oberoi Chairman | ఆతిథ్యరంగ దిగ్గజం పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ కన్నుమూత
Bhupesh Baghel | కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి.. వీడియో
Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి