Joe Biden | కమలా హారిస్‌ను ప్రెసిడెంట్ అని సంభోదించి.. మరోసారి నవ్వులపాలైన బైడెన్
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ నెట్టింట విమర్శల పాలవుతున్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris)ను ‘ప్రెసిడెంట్’ (President) అంటూ సంభోదించి మరోసారి నోరు జారి నవ్వులపాలయ్యారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ నెట్టింట విమర్శల పాలవుతున్నారు. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris)ను ‘ప్రెసిడెంట్’ (President) అంటూ సంభోదించి మరోసారి నోరు జారి నవ్వులపాలయ్యారు.
గత జూన్‌లో స్టాన్లీ కప్ గెలిచిన (Stanley Cup-winning) వెగాస్ గోల్డెన్ నైట్స్ (Vegas Golden Knights) టీమ్‌ను సత్కరించేందుకు సోమవారం వైట్‌హౌస్‌లో (White House ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.. ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి.. ‘ప్రెసిడెంట్’ అంటూ సంభోదించారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియదా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
” President Harris – Biden”
Actually, he said it Again… this isn’t the first time Biden has called Harris the president elect and they’ve BOTH often referred to themselves as the “Harris-Biden Administration” pic.twitter.com/FtZ3di4UBd
— LindaNY00 (@LokiLinda00) December 31, 2020
కాగా, బైడెన్ ఇలా నోరు జారడం ఇదేమీ మొదటిసారి కాదు. కెమెరా సాక్షిగా ఎన్నో సార్లు తప్పిదాలు చేసి విమర్శల పాలయ్యారు. బైడెన్ గతంలోనూ పలుమార్లు ఇలా టంగ్ స్లిప్ అయ్యి నవ్వులపాలైన సందర్భాలు ఉన్నాయి. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఓసారి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఫస్ట్ లేడీ అంటూ సంభోదించారు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి భార్యను ఫస్ట్ లేడీగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే, ఉపాధ్యక్షురాలిని అలా సంబోధించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అదేవిధంగా ఈ ఏడాది జులైలో లుథియానాలో జరిగిన నాటో సదస్సు (NATO Summit)లో పాల్గొన్న బైడెన్ మైకు ముందు టంగ్ స్లిప్ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వొలొదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelenskyy) పేరును పలకబోయి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ (Vladimir) అని సంభోదించబోయారు. అయితే వెంటనే తన పొరపాటును గుర్తించిన అధ్యక్షుడు ఆ తర్వాత సరైన మాట పలికారు. అయితే, ఆ సమయంలో బైడెన్ పక్కనే జెలెన్ స్కీ కూడా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఇక ఒక సందర్భంలో ఉక్రెయిన్ ప్రజలు అనబోయి.. ఇరాన్ ప్రజలు అని మాట్లాడారు. ఆ తర్వాత ‘పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధంలో ఓడిపోయారు’ అనబోయి ‘పుతిన్ ఇరాక్ యుద్ధంలో ఒడిపోయారు’ అంటూ సంభోదించారు. అలా పలు సందర్భాల్లో తన మతిమరుపు కారణంగా టంగ్ స్లిప్ అయ్యి విమర్శల పాలయ్యారు. ఇక, విదేశీ పర్యటకు వెళ్లిన సమయంలో కూడా బైడెన్ ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కుతూ మెట్లపై జారిపడ్డ సందర్భాలూ అనేకం. చాలా సందర్భాల్లో అధ్యక్షుడు కింద పడి వార్తల్లో నిలిచారు.
Also Read..
Vistara | రన్‌వేపైకి వచ్చిన వీధి కుక్క.. ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగిన విస్తారా విమానం
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని సునాక్‌పై తొలి అవిశ్వాస లేఖ.. సొంత పార్టీ ఎంపీ నుంచే
Bike Stunt | బైక్‌పై పటాకులు కాలుస్తూ ప్రమాదకర స్టంట్స్.. యువకుడి అరెస్ట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

