మాస్కో, అక్టోబర్ 11: మార్క్ జుకెర్బర్గ్కు చెందిన ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో ఫేస్బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను రష్యా నిషేధించింది. రష్యాకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పెట్టేలా ఉక్రెయిన్ ప్రజలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనుమతిస్తున్నట్టు మాస్కో కోర్టు కూడా ఆరోపించింది. రష్యా ఆరోపణలను మెటా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కోర్టుకు తెలిపారు.